మళ్లీ మొదలైన దాయాదుల మ్యాచ్... 100 దాటిన భారత్ స్కోరు

  • శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 26 ఓవర్లలో 4 వికెట్లకు 134  పరుగులు
  • నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరాటం జరుగుతోంది. వరుణుడి కారణంగా నిలిచిన మ్యాచ్... వర్షం శాంతించడంతో మళ్లీ మొదలైంది. ప్రస్తుతం భారత్ స్కోరు 26 ఓవర్లలో 4 వికెట్లకు 134 పరుగులు. ఇషాన్ కిషన్ 48, హార్దిక్ పాండ్యా 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 11, కోహ్లీ 4, శ్రేయాస్ అయ్యర్ 14, శుభ్ మాన్ గిల్ 11 పరుగులు చేసి అవుటయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీశారు.

Team India
Pakistan
Rain
Asia Cup
Pallekele
Sri Lanka

More Telugu News